ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోండి' - విశాఖ ప్రజలను కించపరిచేలా పోస్టులు

విశాఖలో విషవాయువు విషాదం అందరినీ కలిచివేసిందని అమరావతి పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ వాసులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి అమరావతి ప్రజలకు ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టులు పెట్టినవారిపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఐకాస తరఫున డీజీపీని కోరారు.

amaravathi jac
amaravathi jac

By

Published : May 8, 2020, 8:56 PM IST

విశాఖలో జరిగిన విషవాయువు ఘటన అందరినీ కలచివేసిందని... అమరావతి పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ వాసులకు ప్రజలు, ప్రభుత్వం అంతా అండగా నిలవాల్సిన సమయమిదని తెలిపింది. ఇలాంటి సమయంలో కొందరు విశాఖ వాసులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి... వాటిని అమరావతి ప్రజలకు ఆపాదిస్తున్నారని ఐకాస అధ్యక్షుడు ఆళ్ల శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం పోరాడే రైతులకు, రాజధాని ప్రాంత ప్రజలకు, ఐకాస నేతలకు ఆ పోస్టులతో సంబంధం లేదని తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చాలని గతంలోనూ కుట్రపన్నారని ఆరోపించారు. అప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అమరావతికి అండగా నిలిచారని గుర్తుచేశారు. పోస్టులు పెట్టిన వారిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఐకాస తరఫున డీజీపీని కోరారు.

ఇవీచదవండి:భారత్​ బయోటెక్​'కు కరోనా నివారణ బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details