అమరావతి అంశంలో మూడు అఫిడవిట్ల సమర్పణపై విచారణ జరపాలని హోంశాఖను అమరావతి ఐకాస ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి కోరారు. అఫిడవిట్ల సమర్పణలో తమ అభ్యంతరాలపై సమీక్షిస్తామని చెప్పారని.. మూడు అఫిడవిట్లను నేరుగా ఏజీకి పంపారా? లేదా? అని అడిగినట్లు శాస్త్రి పేర్కొన్నారు.
మూడు అఫిడవిట్లలో అంశాల పునరావృతంపై వివరణ కోరినట్టు తెలిపారు. అఫిడవిట్లతో అమరావతి రైతులు ఆందోళనలో ఉన్నారని... తమ అభ్యంతరాలపై ఉన్నతస్థాయి భేటీ ఏర్పాటు చేశామని శాస్త్రి వివరించారు.