అమరావతి పరిరక్షణ ఐకాస రాజధాని గ్రామాల్లో ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన జైల్ భరోలో మహిళా రైతుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, కృష్ణాయపాలెంలోని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్‌ను పాటించనున్నట్లు ఐకాస కన్వీనరు పువ్వాడ సుధాకర్ శనివారం తెలిపారు.
నేడు రాజధాని గ్రామాల్లో బంద్ - అమరావతి ఐకాస తాజా వార్తలు
రాజధాని గ్రామాల్లో ఆదివారం సంపూర్ణ బంద్‌కు అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. 'జైల్ భరో'లో పోలీసుల దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఐకాస స్పష్టం చేసింది. 29 గ్రామాల్లో బంద్‌ను విజయవంతం చేయాలని ఐకాస కోరింది.
రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్