రాజధాని బిల్లులపై ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకోవాలని రాజధాని ప్రాంత రైతులు కోరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం, అనంతవరం, వెంకటపాలెం, బోరుపాలెం, రాయపూడిలో రైతులు, మహిళలు 221వ రోజూ అమరావతి కోసం ఆందోళనలు కొనసాగించారు. 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సంతకం చేసేముందు రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
221వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు - amaravthi capital issue
రాజధాని బిల్లులపై సంతకం చేసేముందు... తమ త్యాగాలను ఒకసారి గుర్తుచేసుకోవాలని గవర్నర్ ను అమరావతి రైతులు కోరారు. రాజధాని గ్రామాల్లో 221వ రోజు ఆందోళనలు కొనసాగించిన రైతులు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

221వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు
222వ రోజు ధర్నాను పురస్కరించుకొని ఆదివారం రాజధాని ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇళ్లల్లోనే ధర్నా చేయాలని అమరావతి ఐకాస కన్వీనర్ కోరారు. అనంతరం జూమ్ యాప్ ద్వారా నిర్వహించే వెబ్ నార్ లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :ప్రజలకు నాటు వైద్యం..పాలకులకు కార్పొరేట్ వైద్యమా..? : బుద్దా వెంకన్న