'పాలన అమరావతి నుంచే సాగాలి' - లేటెస్ట్ న్యూస్ ఆఫ్ అమరావతి
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతన్నలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం నాటికి 115వ రోజుకు చేరాయి. పాలన అమరావతి నుంచే సాగాలని డిమాండ్ చేస్తూ అమరావతి వెలుగు పేరుతో కొవ్వొత్తుల నిరసన చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు వినాలని విజ్ఞప్తి చేశారు.
!['పాలన అమరావతి నుంచే సాగాలి' amaravathi formers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6744990-662-6744990-1586552880174.jpg)
పాలన అమరావతి నుంచే సాగాలి...వెలుగు పేరుతో కొవ్వొత్తుల నిరసన
పాలన అమరావతి నుంచే సాగాలి...వెలుగు పేరుతో కొవ్వొత్తుల నిరసన
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 115వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. అమరావతి వెలుగు పేరుతో మందడం, వెంకటపాలెం, బోరుపాలెం, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతినే ఉండాలంటూ మందడంలో మహిళలు మృత్యుంజయ పారాయణం చేశారు. అమరావతి మరింత శోభాయమానంగా అభివృద్ధి చెందాలంటూ వెంకటపాలెంలో దీపారాధన నిర్వహించారు.