రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన జరిగి ఏళ్లు గడిచినా అభివృద్ధి మాత్రం జరగలేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కోసం రైతులందరూ ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీల నేతలను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను కలిసి.. రాజధాని కోసం పార్లమెంటులో తమ గొంతును వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా.. అవకాశం లభించడం లేదని రైతులు తెలిపారు.
'రాజధాని అంశంపై మోదీని కలవాలనుకుంటున్నాం' - amaravathi land puling news
అమరావతి రాజధాని నిర్మాణంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజధానిపై రోజుకో ప్రకటన తీరును చూసి రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించి... రాజధాని నిర్మాణం - అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని రాజధాని పరిధిలోని రైతులు డిమాండ్ చేశారు.
amaravathi farmers want to meet prime minister modi