ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్తున్న సమయంలో మందడం రైతులు జై అమరావతి అంటూ నినదించారు. ముఖ్యమంత్రి వాహనశ్రేణి మందడం శిబిరానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. రైతులు, మహిళలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్షా శిబిరం వద్ద మూడంచెల భద్రతను నెలకొల్పారు. అయినా రైతులు, మహిళలు ఆకుపచ్చ జెండాలు చూపిస్తూ పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.
మందడం మీదుగా సీఎం కాన్వాయ్.. రైతుల జై అమరావతి నినాదాలు - amaravathi farmers news
సీఎం జగన్ సచివాలయానికి వెళ్తున్న సమయంలో మందడం రైతులు జై అమరావతి అంటూ నినదించారు. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

amaravathi farmers shouted slogans at cm jagan convoy