ఏపీ హైకోర్టు నుంచి సిక్కిం హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న జస్టిస్ జేకే మహేశ్వరికి రాజధాని ప్రాంత రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైకోర్టు వద్దకు చేరుకున్న అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఆయన కోసం గంటకు పైగా వేచి ఉన్నారు. ఆయన వెళ్లే మార్గంలో పూలబాట ఏర్పాటు చేశారు. దారిపొడువునా పూలు చల్లి కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు చెప్పారు. హైకోర్టు ప్రాంగణం దాటినప్పటి నుంచి రోడ్డు పక్కన నిలబడి ఆయనకు అభివాదం చేశారు. జాతీయ జెండాలు చేతబూని ఆయనకు నమస్కరించారు. జస్టిస్ మహేశ్వరి వంటి న్యాయమూర్తుల వల్ల తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామని అమరావతి రైతులు తెలిపారు.
జస్టిస్ జేకే మహేశ్వరికి అమరావతి రైతుల ఘన వీడ్కోలు
జస్టిస్ జేకే మహేశ్వరికి రాజధాని అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే మార్గంలో పూలబాట ఏర్పాటు చేశారు. దారిపొడువునా పూలు చల్లి కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ జేకే మహేశ్వరి.. న్యాయబద్ధంగా వ్యవహరించడం వల్లే అమరావతి ప్రాంత ప్రజలు ప్రాణాలతో మిగిలారని రాజధాని రైతులు వ్యాఖ్యానించారు. ప్రాణాలు కాపాడిన దేవుడిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.
జస్టిస్ జేకే మహేశ్వరికి అమరావతి రైతుల ఘన వీడ్కోలు
TAGGED:
జేకే మహేశ్వరికి వీడ్కోలు