ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి అన్నదాతల పోరాటం చిరస్మరణీయం: యనమల - అమరావతి రైతుల పోరాటంపై యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు వార్తలు

అమరావతి రైతుల త్యాగాలు.. రాష్ట్ర చరిత్రలో అజరామరమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని రైతుల పోరాటం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అమరావతి పట్ల జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు.

amaravathi farmers sacrifices are immortal says tdp leader yanamala ramakrishnudu
అమరావతి అన్నదాతల పోరాటం చిరస్మరణీయం: యనమల

By

Published : Dec 13, 2020, 12:44 PM IST

రాజధాని రైతుల పోరాటం చిరస్మరణీయమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 13 జిల్లాల ప్రయోజనం కోసమే అమరావతి రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన అన్నదాతల త్యాగాలు... రాష్ట్ర చరిత్రలో అజరామరమని కొనియాడారు. అమరావతి పట్ల జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నామన్నారు. రాజధాని గ్రామాల్లో వైకాపా దమనకాండను గర్హిస్తున్నామన్నారు. 13 జిల్లాల వెన్నెముకను వైకాపా విరిచేస్తోందని మండిపడ్డారు. విశాఖలో వేలాది ఎకరాల భూములపై ఆ పార్టీ నేతలు కన్నేశారని యనమల ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details