రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ విజయమ్మ... ఉద్యమం చేస్తున్న రైతుల దగ్గరికి ఎందుకు రాలేదని అన్నదాతలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఊరూరా విజయమ్మ తిరిగారని వారు గుర్తు చేశారు.
రైతుల కష్టాలను పరిష్కరించాలని ఎందుకు అడగటం లేదని నిలదీశారు. ఇప్పటికైనా అమరావతిలోని భవనాలు గ్రాఫిక్స్ కావని.. అవి నిజమైనవి అన్న విషయాన్ని సీఎంకు చెప్పాలని సూచించారు. రైతులు, మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు.