ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రభుత్వం మీద నమ్మకంలేదు.. న్యాయస్థానాలే మాకు దిక్కు'

By

Published : Nov 25, 2020, 5:37 PM IST

ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని.. న్యాయస్థానాలపైనే తమ ఆశలు పెట్టుకున్నామని అమరావతి రైతులు అన్నారు. 344వ రోజు ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

amaravathi protest
అమరావతి రైతుల ఆందోళనలు

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళల ఉద్యమం 344వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, అనంతవరం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బోరుపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎర్రబాలెంలో రైతులు, మహిళలు అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేశారు.

రాజధానిగా అమరావతినే ఉంచాలని, ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని మహిళలు పూజలు నిర్వహించారు. తామంతా న్యాయస్థానాలపైనే నమ్మకం పెట్టుకున్నామని రైతులు చెప్పారు. ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందన్నారు. న్యాయస్థానం నుంచి తుది తీర్పు వచ్చిన తర్వాత అన్ని పండుగలను ఒకేసారి జరుపుకుంటామని మహిళలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details