ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం తీరు మారట్లేదు: అమరావతి రైతులు - అమరావతి రైతుల దీక్షలు

అమరావతి కోసం రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. 342వ రోజు అన్నదాతలు నిరసన దీక్షలు చేశారు. ఇన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోనట్లు వ్యవహరించడం తగదన్నారు.

amaravathi protest
అమరావతి ఆందోళనలు

By

Published : Nov 23, 2020, 9:58 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన దీక్షలు 342వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

అమరావతిపై ప్రభుత్వ తీరును రైతులు ఎండగట్టారు. 342 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం దిగొచ్సి అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచుతామని చెప్పేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details