పండుగ రోజూ అమరావతి రైతులు రోడ్డెక్కారు. అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 313వ రోజు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, మందడం, నెక్కల్లు, బోరుపాలెం గ్రామాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. తుళ్లూరులో మహిళలు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. నెక్కల్లు, అనంతవరంలో చిన్నారులు అమరావతి పాటలకు నృత్యాలు చేశారు. విద్యార్థినులు చేసిన నృత్యం ఆలోచింపచేసింది.
పండుగ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు - ఏపీ రాజధాని రైతుల నిరసనలు
అమరావతి రైతుల దీక్షలు 313వ రోజూ కొనసాగాయి. పరిపాలన రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ.. మహిళలు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
అమరావతి రైతుల ఆందోళనలు