ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టంచేశారు. పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 297వ రోజుకు చేరుకుంది. వెలగపూడి, మందడం, పెదపరిమి, నీరు కొండ, కృష్ణాయపాలెంలో రైతులు దీక్షా శిబిరాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెక్కల్లులో రైతులు వినూత్న నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం తమను రోడ్డుపాలు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకుంటారని ఒక్క అవకాశం ఇస్తే తాము జీవించడానికి వీలు లేకుండా చేశారంటూ ముఖ్యమంత్రిపై రైతులు విమర్శలు గుప్పించారు.
వైకాపా ప్రభుత్వం మమ్మల్ని రోడ్డుపాలు చేసింది: అమరావతి రైతులు - అమరావతి దీక్షలు
అమరావతి రైతుల దీక్షలు 297వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులంటూ వైకాపా ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని డిమాండ్ చేశారు.
అమరావతి రైతుల దీక్షలు