రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను నిరసిస్తూ.. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో రహదారులను దిగ్బంధించారు. కురగల్లులో ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టారు. జీఎన్‌రావు కమిటీకి చట్టబద్ధత లేదని విమర్శించారు. రాజధానిలో పర్యటించకుండా నివేదిక ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు.
జీఎన్ రావు కమిటీకి చట్టబద్ధత లేదు: రాజధాని రైతులు - అమరావతి రైతుల ఆందోళన
అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే అమరావతికి భూములు ఇచ్చామనీ.. ఇప్పుడు ఇక్కడి నుంచి రాజధానిని తరలిస్తే తమ గతి ఏమవుతుందంటూ రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఆలోచనను సీఎం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అమరావతి రైతుల ఆందోళన
అమరావతి రైతుల ఆందోళన
అమరావతి రైతుల ఆందోళన