అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. 369వ రోజు రైతులు ఆందోళన చేశారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఎర్రబాలెం, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెం రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతి ఉద్యమం రోజువారి విధుల్లో భాగమైపోయిందని.. పండగైనా, పుట్టిన రోజు వేడుకలైనా శిబిరాల వద్దే చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. అనంతవరంలో ఓ మహిళ కుమార్తె పుట్టినరోజును నిరసన దీక్షలోనే ఏర్పాటు చేశారు. నెక్కల్లులో సెమీ క్రిస్మస్ వేడుకలు జరపగా.. తుళ్లూరులో అమరావతికి మద్దతుగా రైతులు సర్వమత ప్రార్థనలు చేశారు.
369వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు - amaravathi farmers protest
అమరావతి రైతుల నిరసనలు 369వ రోజుకు చేరాయి. అమరావతి ఉద్యమం రోజువారి విధుల్లో భాగమైపోయిందని.. పండగైనా, పుట్టిన రోజు వేడుకలైనా శిబిరాల వద్దే చేసుకుంటున్నామని రైతులు తెలిపారు.
369వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు