రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు.. 375వ రోజుకు చేరాయి. ఇళ్లపట్టాల పంపిణీ సందర్భంగా సీఎం జగన్.. రాజధాని గురించి చెబుతూ కులాల ప్రస్తావన చేశారంటూ రైతులు ఆగ్రహించారు. ఈ ప్రాంతంలోని తాడికొండ.. ఎస్సీ నియోజకవర్గం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి రాజధాని విషయంలో న్యాయం చేయాలని కోరారు.
'రాజధాని విషయంలో కులాల ప్రస్తావన చేస్తారా?' - అమరావతిలో మూడు రాజధానులపై రైతుల నిరసన
రాజధానిలో కులాల ప్రస్తావనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులు ఖండించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 375వ రోజూ ఆందోళనలు కొనసాగించారు.
375వ రోజు అమరావతి రైతుల నిరసన