ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravathi Farmers: అమరావతిపై ప్రభుత్వం మెద్దు నిద్ర వీడాలి: ఐకాస నేతలు - రైతుల పాదయాత్ర వార్తలు

రాజధాని అమరావతిపై ప్రభుత్వం మెద్దు నిద్ర వీడాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. మహా పాదయాత్రకు నేడు విరామం ఇవ్వడంతో ప్రకాశం జిల్లా యరజర్ల వద్ద వారు బస చేసిన ప్రాంతంలోనే కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అమరావతి అందరి రాజధాని కాబట్టే ప్రజల మద్దతు ఉందని ఐకాస నేతలు స్ఫష్టం చేశారు.

అమరావతిపై ప్రభుత్వం మెద్దు నిద్ర వీడాలి
అమరావతిపై ప్రభుత్వం మెద్దు నిద్ర వీడాలి

By

Published : Nov 13, 2021, 4:04 PM IST

అమరావతిపై ప్రభుత్వం మెద్దు నిద్ర వీడాలి

అమరావతి రైతులు చేస్తున్న పోరాటంపై (Amaravati capital protest) ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని ఐకాస నేతలు (Amaravathi Jac leaders) డిమాండ్ చేశారు. మహా పాదయాత్రకు నేడు విరామం ఇవ్వడంతో ప్రకాశం జిల్లా యరజర్ల వద్ద వారు బస చేసిన ప్రాంతంలోనే కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తాము మొదటి నుంచీ చెబుతున్నట్లు అమరావతి అందరి రాజధాని అని..అందుకే ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారని ఐకాస నేతలు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అమరావతి పాదయాత్ర జైత్రయాత్రగా మారుతోందని.. న్యాయస్థానంలో విజయం తథ్యమని విశ్వాసం వెలిబుచ్చారు.

పాదయాత్రకు విరామం..

రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఐకాస నేతలు శనివారం విరామం(break of amaravati farmers padayatra) ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నిడమనూరు గ్రామ పంచాయతీ 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక (by-poll) జరగనుంది. ఫలితంగా పాదయాత్ర జరపరాదని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారి ఆదేశాలను గౌరవిస్తూ.. పాదయాత్రకు ఐకాస నేతలు విరామం ప్రకటించారు.

అడుగడుగునా జన నీరాజనం...

ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. 12వ రోజు ముక్తినూతలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర యరజర్ల శివారులో ముగిసింది. ఒంగోలులో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్ నుంచి..మంగమ్మ కళాశాల సెంటర్ జంక్షన్ వరకూ నిన్న పాదయాత్ర సాగింది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌, బీసీ సంఘాలు, హైదరాబాద్‌లోని ఏపీ వాసులు సంఘీభావం తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి సమదూరం ఉంటుంది. కాబట్టి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఘనస్వాగతం...

ఒంగోలులో బృందావన కళ్యాణ మండపం నుంచి శుక్రవారం ప్రారంభమైన రైతుల పాదయాత్ర పోలీసుల పహారా నడుమ కొనసాగింది. రైతులకు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలికారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగారు. రైతుల పాదయాత్రకు స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై అమరావతి అనే నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాట నృత్యాలమధ్య పాదయాత్ర సందడిగా సాగింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. శుక్రవారం యరజర్లలో ముగిసిన పాదయాత్ర ఆదివారం అక్కడి నుంచే ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

Amaravathi farmer paada yatra: మరింత జోరుగా మహాపాదయాత్ర.. అడుగడుగనా జన నీరాజనం

ABOUT THE AUTHOR

...view details