102వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి రాజధాని కోసం రైతుల 102వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ రైతులు తమ ఆందోళనలు చేపట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మాస్కులు ధరించి ఇంటి వద్దే జై అమరావతి నినాదాలు చేశారు. అమరావతిలోని అన్ని గ్రామాల్లో రైతులు తమ నివాసం వద్దే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.