'మూడు రాజధానులు వద్దు - అమరావతే ముద్దు' అనే నినాదంతో రైతులు చేస్తున్న దీక్షలు 95వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి కోసం రైతులు, మహిళలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అమరావతిని సాధించుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు ధరించి రాయపూడి దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన తెలిపారు. 3 అడుగుల దూరం పాటిస్తూ కూర్చున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
రాయపూడిలో 95వ రోజు అమరావతి ఆందోళనలు - అమరావతి ఆందోళనలు
రాయపూడిలో అమరావతి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిని సాధించేవరకూ పోరాటం ఆపబోమని మహిళలు, రైతులు స్పష్టంచేశారు.
అమరావతి రైతుల ఆందోళనలు