విశాఖ ఉక్కు, అమరావతిని రక్షించుకుందామంటూ రాజధాని రైతులు 431వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, నెక్కళ్లు, అబ్బరాజుపాలెం, దొండపాడు, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. 'విశాఖ ఉక్కును కాపాడుకుంటాం-అమరావతిని రక్షించుకుంటాం' అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో మహిళలు, రైతులు మోకాళ్లపై నిల్చొని నిరసనలు తెలిపారు. విశాఖ పరిశ్రమను రక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. దిల్లీ స్థాయిలో ఉద్యమం చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వం వహించాలన్నారు.
'విశాఖ ఉక్కును కాపాడుకుంటాం..అమరావతిని రక్షించుకుంటాం' - అమరావతి రైతుల ఆందోళన తాజా వార్తలు
విశాఖ ఉక్కు, అమరావతిని రక్షించుకుందామంటూ రాజధాని రైతులు 431వ రోజు ఆందోళనలు కొనసాగించారు. 'విశాఖ ఉక్కును కాపాడుకుంటాం-అమరావతిని రక్షించుకుంటాం' అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
విశాఖ ఉక్కును కాపాడుకుంటాం..అమరావతిని రక్షించుకుంటాం