364వ రోజుకు అమరావతి రైతుల ఉద్యమం చేరుకుంది. రాజధాని గ్రామాల్లో నేడు నిరసన కార్యక్రమాలకు ఐకాస పిలుపునివ్వడంతో.. వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఎస్సీలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వెలగపూడిలో మానవహారం, తుళ్లూరులో ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహించారు.
అమరావతిలో నిరసనల హోరు.. 364వ రోజుకు చేరిన ఉద్యమం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
అమరావతి రైతుల ఉద్యమం 364వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో నేడు నిరసన కార్యక్రమాలకు ఐకాస పిలుపునిచ్చింది. వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఎస్సీల ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టింది.
amaravathi farmers