ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మరణించిన మహిళపై కేసులా?'

షెడ్యూల్డు కులాలకు చెందిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని అమరావతి రైతులు మండిపడ్డారు. మరణించిన మహిళపై కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు.

amaravathi farmers
amaravathi farmers

By

Published : Dec 13, 2020, 9:35 AM IST

వైకాపా నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వారికి అనుకూలంగా పని చేస్తున్నారని అమరావతి రైతులు (అసైన్డు) విమర్శించారు. షెడ్యూల్డు కులాలకు చెందిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అమరావతిలో 361వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు.

పోలీసుల తీరును నిరసిస్తూ మందడం, ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరాల్లో రైతులు ప్లకార్డులతో ఆందోళన చేశారు. తమపై నమోదైన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ తుళ్లూరులో మహిళలు గీతా పారాయణం చేశారు. దొండపాడు, అనంతవరం,. పెనుమాక ఆందోళన నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details