వైకాపా ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసిన అమరావతిని ముంచలేరని ఆ ప్రాంత రైతులు తేల్చిచెప్పారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... రైతులు చేస్తున్న ఉద్యమం 305వ రోజుకు చేరుకుంది. శరన్నవరాత్రులు ప్రారంభంతో దీక్షా శిబిరాల వద్ద అన్నదాతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచాలంటూ కృష్ణమ్మకు కృష్ణాయపాలెం రైతులు సారే సమర్పించారు. ఐనవోలు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... అమ్మవారికి పొంగళి సమర్పించారు. హైదరాబాద్ నీటిలో నానుతుంటే... అమరావతి చుట్టూ కృష్ణా నది ఉన్నా ఒక్క గ్రామంలోకి నీళ్లు రాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిపై తప్పుడు ప్రచారాన్ని విరమించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:
305వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు - రాజధాని రైతుల నిరసన
పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... రైతులు చేస్తున్న ఉద్యమం 305వ రోజుకు చేరుకుంది. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచాలంటూ కృష్ణమ్మకు సారే సమర్పించారు. హైదరాబాద్ నీటిలో నానుతుంటే... అమరావతి చుట్టూ కృష్ణా నది ఉన్నా ఒక్క గ్రామంలోకి నీళ్లు రాలేదని అన్నారు.
![305వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు amaravathi farmers protest in guntur district over three capital system](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9208287-80-9208287-1602919591598.jpg)
305వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
305వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
Last Updated : Oct 17, 2020, 2:48 PM IST