వెలగపూడి.. 74వ రోజూ తగ్గని రాజధాని పరిరక్షణ పోరాట వేడి - అమరావతి తాజా వార్తలు
74 వ రోజూ అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినాదాలు హోరెత్తుతున్నాయి. వెలగపూడిలోని దీక్షా శిబిరంలో మహిళలు, రైతులు.. జై అమరావతి అంటూ నినదించారు. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.