విజయవాడ పటమట తహశీల్దారు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు నేతృత్వంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. రైతుల త్యాగాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. కృష్ణా జిల్లా నందిగామ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
అమరావతి ఉద్యమం @ 300 - అమరావతి ఉద్యమం 300 రోజులు
13:03 October 12
అమరావతి రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు నిరసన
13:03 October 12
రాజధాని రైతులకు సంఘీభావం
అమరావతిలో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష ఐకాస, తెలుగుదేశం నాయకులు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. గాంధీ బొమ్మ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో అమరావతి, అఖిలపక్ష ఐకాస, తెదేపా నాయకులు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.
12:58 October 12
వెంకటపాలెం వద్ద ఉద్రిక్తత
అమరావతి: వెంకటపాలెం వద్ద ఉద్రిక్తత
లోకేశ్ మినహా ఇతర నేతల వాహనాలను అనుమతించని పోలీసులు
లోకేశ్, ఎంపీ గల్లా జయదేవ్ వాహనాలను మాత్రమే పంపించిన పోలీసులు
అన్ని వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ తెదేపా శ్రేణుల ఆందోళన
12:11 October 12
రాజధాని గ్రామాల్లో లోకేశ్, ఎంపీ గల్లా జయదేవ్ పర్యటన
- అమరావతి: 300వ రోజుకు చేరిన రాజధాని రైతులు, కూలీలు, మహిళల ఉద్యమం
- తుళ్లూరు, మందడం, వెలగపూడిలో జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు
- అమరావతి: ఆకుపచ్చ చీరలు ధరించి నిరసనలో పాల్గొన్న మహిళలు
- వెలగపూడి శిబిరం వద్ద తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు
- అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎస్సీ మహిళా నేత శోభారాణి
- అమరులైన 92 మందికి నివాళులు అర్పించిన రైతులు, మహిళలు
11:40 October 12
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. అమరావతి రైతుల 300 రోజుల దీక్షకు మద్దతుగా మంగళం రోడ్డులో.. భవన నిర్మాణ కార్మికుల వేషం ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల యువత ఉపాధి కోల్పోయి .. కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
09:47 October 12
గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిరసన దీక్ష
- అమరావతికి మద్దతుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిరసన దీక్ష
- గుంటూరు వసంతరాయపురంలోని నక్కా ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో దీక్ష
- గుంటూరు: నిరసన దీక్షలో పాల్గొన్న జిల్లా తెదేపా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు
- గుంటూరు: నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామకృష్ణ, ఇతర తెదేపా నేతలు
- గుంటూరులో నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిసిన నేతలు
09:35 October 12
ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే: నారా లోకేశ్
- జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైంది: లోకేశ్
- ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అని నినదించారు: లోకేశ్
- రైతులు, మహిళలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా: లోకేశ్
- ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే: నారా లోకేశ్
09:34 October 12
అమరావతి రైతులకు మద్దతుగా ఆస్ట్రేలియాలో నిరసనలు
అమరావతి ఉద్యమం 300రోజులుకు చేరిన సందర్బంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆందోళన చేపట్టారు. తాము 200వ రోజు, 250వ రోజు కాన్బెర్రాలో నిరసనలు చేపట్టామని గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు 300వ రోజు రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్నామని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని అన్నారు. చారిత్రాత్మక పేరు కలిగిన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
08:53 October 12
అందరూ ఏకమై.. అమరావతి కోసం పోరాడదాం: చంద్రబాబు
- రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడదాం: చంద్రబాబు
- రాజధానిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలుగా మనందరి బాధ్యత: చంద్రబాబు
- నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం: చంద్రబాబు
- రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో 300 రోజులు: చంద్రబాబు
- 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు: చంద్రబాబు
- అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు: చంద్రబాబు
08:52 October 12
అమరావతి రైతులకు మద్దతుగా తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ ధర్నా
- అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన
- తిరుపతి మంగళం రోడ్డులో భవన నిర్మాణ కార్మికుల వేషం ధరించి నిరసన
06:09 October 12
అమరావతి ఉద్యమం ఉద్ధృతం
అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరింది. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించిన అమరావతి ఐకాస నేడు భిన్న రీతిలో నిరసన తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 9 గంటలకు దీక్షా శిబిరాల్లో అమరావతి ఐకాస జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉద్యమంలో అమరులైన 92 మందికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తుళ్లూరు శిబిరం వద్ద రైతులు నిరసన ప్రదర్శన చేపడుతారు. అమరావతికి న్యాయం చేయాలంటూ ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ప్రదర్శనలు చేయనున్నారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 వరకు గ్రామాల్లో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని అమరావతి ఐకాస కన్వీనర్ కోరారు.