Amaravathi Farmers Protest: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ 795 రోజులుగా ఆందోళనలు చేస్తున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక రైతులు.. తిరుపతికి పాదయాత్రగా బయల్దేరారు. ఇవాళ ఉదయం మోతడక నుంచి ఆకుపచ్చ కండువాలు, జెండాలు పట్టుకొని పాదయాత్రను మొదలుపెట్టారు. "మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దు".., "రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే" అంటూ నినాదాలు చేశారు. మార్గమధ్యంలో గుంటూరు నగరంలోని గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి మొక్కు చెల్లించుకోనున్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. ఇకనైనా.. ప్రభుత్వం దిగొచ్చి మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.