ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోరెత్తిన అమరావతి రైతులన నిరసన.. దద్దరిల్లిన మందడం శిబిరం - amaravathi farmers protest latest news

ఉద్యమ నినాదాలతో మందడం శిబిరం దద్దరిల్లింది. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో జై అమరావతి అంటూ నినదించారు. రైతులు, మహిళలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

amaravathi farmers protest at mandhadam
amaravathi farmers protest at mandhadam

By

Published : Dec 4, 2020, 1:33 PM IST

అమరావతిలో రైతులు, మహిళలు ఆందోళన ఉద్ధృతం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ మార్గంలో వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ గోడు వినిపించేలా 'జై అమరావతి' అంటూ నినదించారు. పెద్దఎత్తున నినాదాలతో మందడం శిబిరం దద్దరిల్లింది.

నిరసనకారులు రోడ్డుపైకి రాకుండా పోలీసులు నిలువరించారు. రైతులు, మహిళలను అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రైతులు రెండు చేతులు పైకెత్తి దండాలు పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details