రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రైతులు న్యాయస్థానాన్ని కోరారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల వద్ద తీసుకున్న భూములకు ప్రభుత్వం కౌలు చెల్లించాలి. గతేడాది వరకు డబ్బులు ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఇంకా కౌలు చెల్లించలేదు. అసలే కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని.. కౌలు కూడా రాక మరింత అవస్థలు పడుతున్నామని రైతులు చెప్పారు. జూన్ నెలాఖరు వచ్చినా డబ్బులు అందలేదని వాపోయారు. దీనిపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.