ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Live Updates: ముగిసిన రాజధాని రైతుల తొలిరోజు మహాపాదయాత్ర - undefined

అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

By

Published : Sep 12, 2022, 10:44 AM IST

Updated : Sep 12, 2022, 5:53 PM IST

15:10 September 12

దాదాపు 12గంటల పాటు 15కి.మీ మేర సాగిన పాదయాత్ర

  • ముగిసిన రాజధాని రైతుల తొలిరోజు మహాపాదయాత్ర
  • వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవ్వులూరు మీదుగా మంగళగిరి చేరుకున్న మహాపాదయాత్ర
  • మంగళగిరి పట్టణంలో ట్రాక్టర్ల కొద్దీ పూలవర్షం కురిపిస్తూ రైతులకు ఘన స్వాగతం పలికిన స్థానికులు
  • ఉదయం 6గంటల నుంచి దాదాపు 12గంటల పాటు 15కి.మీ మేర సాగిన పాదయాత్ర
  • తొలిరోజు పాదయాత్ర కు వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మద్దతు పలికిన ప్రజలు
  • రైతులకు అడుగడుగునా ఘన స్వాగతం పలికిన వివిధ వర్గాల ప్రజలు
  • దారి పొడవునా పూలు చల్లుతూ సంఘీభావం తెలిపిన స్థానికులు
  • వైకాపా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సహా పాదయాత్రకు మద్దతు తెలిపిన తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు

14:10 September 12

రాజధాని రైతుల మహాపాదయాత్రకు భోజన విరామం

  • రాజధాని రైతుల మహాపాదయాత్రకు భోజన విరామం
  • ఎర్రబాలెం సమీపంలో భోజన చేసేందుకు ఆగిన రైతులు
  • మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభం కానున్న పాదయాత్ర

13:25 September 12

పెనుమాక చేరుకున్న రైతుల మహా పాదయాత్ర

  • కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • పెనుమాక చేరుకున్న రైతుల మహా పాదయాత్ర
  • పెనుమాకలో రైతులకు ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు

13:24 September 12

రాష్ట్రానికి 3 రాజధానులు సరికాదు: సీపీఎం నేత మధు

  • విశాఖ: రాష్ట్రానికి 3 రాజధానులు సరికాదు: సీపీఎం నేత మధు
  • అమరావతి రైతుల యాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య లేదు: మధు
  • వైకాపా నాయకులు సృష్టిస్తేనే శాంతిభద్రతల సమస్య వస్తుంది: మధు
  • అమరావతి రాజధాని వ్యవహారానికి భాజపా వైఖరే కారణం: మధు

12:10 September 12

అమరావతి రైతుల మహాపాదయాత్రకు లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు

  • అమరావతి రైతుల మహాపాదయాత్రకు లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు
  • రైతులు తమకు జరిగిన అన్యాయంపై పాదయాత్ర చేపట్టారు: లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు
  • తమకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించేందుకు రైతుల పాదయాత్ర: బాబ్జీ
  • హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాల్సిందే: లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు
  • అణచివేతలు, నిర్బంధాలు, అరెస్టులు జరగకుండా రైతులకు అండగా ఉండాలి: బాబ్జీ

12:10 September 12

వెయ్యి రోజులుగా పోరాడుతున్న అమరావతి రైతులకు అభినందనలు: లోకేశ్

  • వెయ్యి రోజులుగా పోరాడుతున్న అమరావతి రైతులకు అభినందనలు: లోకేశ్
  • ఓర్పు, సహనంతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు: లోకేశ్‌
  • మీ త్యాగాలతో అమరావతికి పునాదులు పడ్డాయి: లోకేశ్‌
  • మీ పోరాటంతో అమరావతి చిర‌స్థాయిగా నిలిచిపోతుంది: లోకేశ్‌
  • మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా: లోకేశ్‌

10:50 September 12

పాదయాత్రలో పార్టీలకతీతంగా పెద్దఎత్తున పాల్గొన్న రైతులు

  • కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • వెంకటపాలెం నుంచి మొదలైన రైతుల మహా పాదయాత్ర
  • వెంకటపాలెంలో 108 గుమ్మడి కాయలు కొట్టిన మహిళలు
  • పాదయాత్రలో పార్టీలకతీతంగా పెద్దఎత్తున పాల్గొన్న రైతులు
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
  • పాదయాత్రకు తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల మద్దతు

10:50 September 12

కృష్ణాయపాలెం చేరుకున్న రైతుల మహా పాదయాత్ర

  • కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • కృష్ణాయపాలెం చేరుకున్న రైతుల మహా పాదయాత్ర
  • ఘనస్వాగతం పలికిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలు

10:42 September 12

రైతుల పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి

  • కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • రైతుల పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి
  • అమరావతి విషయంలో వైకాపా, భాజపావి దొంగ నాటకాలు: రేణుకా చౌదరి
  • మూడేళ్లుగా ఏం చేశారని ఇప్పుడు వైకాపా 3 రాజధానులని అంటోంది: రేణుక
  • కేంద్రం తలచుకుంటే వివాదాలు లేకుండా అమరావతి పూర్తి చేయగలదు: రేణుక

10:42 September 12

రాజధాని రైతులంతా వైకాపా నేతలకు డబ్బులిస్తారు: తెనాలి శ్రావణ్ కుమార్‌

  • రాజధాని రైతులంతా వైకాపా నేతలకు డబ్బులిస్తారు: తెనాలి శ్రావణ్ కుమార్‌
  • అరసవల్లి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయగలరా?: శ్రావణ్‌ కుమార్‌

10:42 September 12

రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడవుగా కేంద్రం నిధులిచ్చింది: భాజపా నేత

  • రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడవుగా కేంద్రం నిధులిచ్చింది: భాజపా నేత
  • జగన్‌ సీఎం అయ్యాక అమరావతికి నిధులు అడగడం మానేశారు: పాతూరి నాగభూషణం
  • మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని తరలించే సాహసం జగన్‌ చేయలేరు: నాగభూషణం

10:41 September 12

కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర

  • కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • వెంకటపాలెం శివారు తితిదే ఆలయంలో రైతుల పూజలు
  • వెంకటపాలెం నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • సర్వమత ప్రార్థనలు చేసి పాదయాత్ర ప్రారంభించిన రైతులు
  • పాదయాత్రలో పార్టీలకతీతంగా పెద్దఎత్తున పాల్గొన్న రైతులు
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
  • రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపిన వైకాపా కార్యకర్తలు
  • పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం
  • రథం నడిపే బాధ్యతను మద్దతు తెలిపిన వైకాపా శ్రేణులకే అప్పగించిన రైతులు
  • కొద్ది దూరం రథం నడిపిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు
  • రథం నడిపిన సీపీఐ నారాయణ, భాజపా నేత కామినేని శ్రీనివాస్
  • పాదయాత్రకు తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల మద్దతు
  • రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపిన భాజపా నేత పాతూరి నాగభూషణం
  • పాదయాత్రలో పాల్గొన్న తెనాలి శ్రావణ్ కుమార్, బాబూరావు (సీపీఎం)
  • వెంకటపాలెంలో 108 గుమ్మడి కాయలు కొట్టిన మహిళలు

10:41 September 12

2019లో జగన్‌ గెలవాలని ఊరూరా తిరిగి ఓట్లు వేయించాం: వైకాపా నేత సతీశ్‌ చంద్ర

  • 2019లో జగన్‌ గెలవాలని ఊరూరా తిరిగి ఓట్లు వేయించాం: వైకాపా నేత సతీశ్‌ చంద్ర
  • ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: సతీశ్‌ చంద్ర
  • రైతు కులంగా పార్టీలకతీతంగా పాదయాత్రలో భాగస్వాములమయ్యాం: సతీశ్ చంద్ర

10:40 September 12

రైతులు చేసేది దండయాత్ర కాదు.. ధర్మయాత్ర: తులసిరెడ్డి

  • రైతులు చేసేది దండయాత్ర కాదు.. ధర్మయాత్ర: తులసిరెడ్డి
  • రాజధాని విషయంలో ప్రభుత్వం ప్లేటు ఫిరాయించింది: సీపీఐ నారాయణ
  • ప్రజలు మాత్రం ప్లేటు ఫిరాయించకుండా అమరావతికే కట్టుబడి ఉన్నారు: నారాయణ
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వ వ్యవహారం: శ్రీనివాస్‌ (సీపీఎం)
  • రైతుల పాదయాత్రకు ఆటంకం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత: శ్రీనివాస్‌

10:40 September 12

కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర

  • కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • వెంకటపాలెం శివారు తితిదే ఆలయంలో రైతుల పూజలు
  • వెంకటపాలెం నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర
  • సర్వమత ప్రార్థనలు చేసి పాదయాత్ర ప్రారంభించిన రైతులు
  • పాదయాత్రలో పార్టీలకతీతంగా పెద్దఎత్తున పాల్గొన్న రైతులు
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
  • రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపిన వైకాపా కార్యకర్తలు
  • పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం
  • రథం నడిపే బాధ్యతను మద్దతు తెలిపిన వైకాపా శ్రేణులకే అప్పగించిన రైతులు
  • కొద్ది దూరం రథం నడిపిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు
  • రథం నడిపిన సీపీఐ నారాయణ, భాజపా నేత కామినేని శ్రీనివాస్
  • పాదయాత్రకు తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల మద్దతు

10:39 September 12

రాజధాని రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం

  • రాజధాని రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం
  • వెంకటపాలెం శివారు తితిదే ఆలయంలో రైతుల పూజలు
  • తితిదే ఆలయం నుంచి మొదలైన రైతుల పాదయాత్ర
  • వెంకటపాలెం చేరుకున్న రాజధాని రైతుల పాదయాత్ర
  • పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

10:39 September 12

రాజధాని పనులు ఆపేసి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకున్నారు: చింతమనేని

  • రాజధాని పనులు ఆపేసి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకున్నారు: చింతమనేని
  • భూములు ఇచ్చిన రైతులను అన్యాయం చేశారు: చింతమనేని
  • వైకాపా నేతలు ఎక్కడైనా గజం స్థలం ఇవ్వగలరా?: చింతమనేని
  • మూడు రాజధానులు అయ్యే పనికాదు: చింతమనేని
  • జగన్‌కు ధైర్యం ఉంటే అమరావతిపై ఎన్నికలకు వెళ్లాలి: చింతమనేని
  • అసెంబ్లీ రద్దు చేసి అమరావతిపై ఎన్నికలకు వెళ్లాలి: చింతమనేని
  • పాదయాత్ర తెదేపా నడిపిస్తుందనడంలో అర్థం లేదు: చింతమనేని
  • మేం నడిపిస్తే మా పార్టీ మొత్తం ఇక్కడే ఉండేది: చింతమనేని

10:38 September 12

రాజధాని రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం

  • రాజధాని రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం
  • వెంకటపాలెం శివారు తితిదే ఆలయంలో రైతుల పూజలు
  • తితిదే ఆలయం నుంచి వెంకటపాలెం వైపు సాగుతున్న పాదయాత్ర
  • పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
  • రైతుల వెంట నడుస్తున్న చింతమనేని ప్రభాకర్

10:38 September 12

రాజధాని రైతుల పోరాటానికి నేటికి వెయ్యి రోజులు

  • రాజధాని రైతుల పోరాటానికి నేటికి వెయ్యి రోజులు
  • వెయ్యి రోజుల ఉద్యమం సందర్భంగా నేటి నుంచి మహా పాదయాత్ర-2
  • అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతుల పాదయాత్ర
  • 900 కిలోమీటర్లకు పైగా సాగనున్న మహా పాదయాత్ర
  • 60 రోజులపాటు జరిగేలా పాదయాత్రకు రూపకల్పన
  • గుంటూరు జిల్లాలో 9 రోజులపాటు సాగనున్న పాదయాత్ర
  • 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర
  • తొలిరోజు వెంకటపాలెం, కృష్ణాయపాలెం మీదుగా యాత్ర
  • తొలిరోజు పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వరకు యాత్ర
  • రాత్రి మంగళగిరిలో బస చేయనున్న రైతులు
  • రైతుల పాదయాత్రకు మద్దతు తెలపనున్న రాజకీయ పక్షాలు
  • పాదయాత్రకు తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, జనసేన మద్దతు
  • రైతుల పాదయాత్రలో పాల్గొననున్న నారా లోకేశ్‌

10:34 September 12

Live Updates:అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

  • నేడు అమరావతి రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం
  • తొలి రోజు కృష్ణాయపాలెం, పెనుమాక మీదుగా సాగనున్న పాదయాత్ర
  • రాత్రికి మంగళగిరిలోని కల్యాణమండపాల్లో బస చేయనున్న రైతులు
  • పాదయాత్రలో పాల్గొననున్న పలువురు నేతలు
  • పాదయాత్రలో పాల్గొననున్న కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, తులసిరెడ్డి
  • పాదయాత్రలో పాల్గొననున్న బోనబోయిన శ్రీనివాస్, సీపీఐ నారాయణ
  • రైతులతో కలసి పాదయాత్రలో పాల్గొననున్న నారా లోకేశ్
  • 900 కిలోమీటర్లకు పైగా సాగనున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర-2
  • నవంబర్ 11న ముగియనున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర-2
  • నేటితో 1000 రోజులు పూర్తిచేసుకున్న అమరావతి రైతుల ఉద్యమం
  • నవంబర్11న శ్రీకాకుళంలోని అరసవెల్లిలో ముగియనున్న పాదయాత్ర
Last Updated : Sep 12, 2022, 5:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details