అమరావతిని రక్షించి, భూములు త్యాగం చేసిన వారికి అన్యాయం జరగకుండా చూడాలంటూ కేంద్ర మంత్రులను అమరావతి రైతులు కోరారు. 3 రాజధానుల నిర్ణయం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కేంద్రానికి తెలిపేందుకు దిల్లీలో పర్యటిస్తున్న రైతులు, తెదేపా ఎంపీల ఆధ్వర్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషిని కలిసి తమ ఆవేదన వివరించారు. అన్ని పార్టీలూ అమరావతే రాజధానిగా ఉండాలంటున్నా సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజధానిలో నిర్మాణం పూర్తైన భవనాల ఫొటోలను రైతులు చూపగా నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి సమస్యను తీసుకెళ్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.
సరైన సమయంలో.. కేంద్రం రంగంలోకి..