రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే అభివృద్ధిలో పూర్తిగా వెనక్కిపోతామని బౌద్ధ మత గురువు దలైలామకు అమరావతి రైతులు తెలిపారు. ఈ మేరకు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య పేరుతో శుక్రవారం రైతులు దలైలామాకు వ్యక్తిగతంగా రాసిన లేఖల్ని విడుదల చేశారు. 'ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడం హర్షనీయమని, ఈ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జాతీయ మహిళా పార్లమెంటు ప్రారంభ సదస్సు సందర్భంగా మీ ప్రసంగంలో పేర్కొన్నారు. శాంతి ఉన్న చోటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని నాడు అన్నారు. గత ఆరు నెలల కాలంలో.. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మాపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. 2 వేల మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఇలాంటి చర్యలతో మానసికంగా ఒత్తిడికి గురై, ఆర్థిక సమస్యలతో 63 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. భూముల విలువ పడిపోయి, జీవనోపాధి కోల్పోయి మా పిల్లల పెళ్లిళ్లు చేయలేక ఏడాదికాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలు తెలుసుకునేందుకు రాజధాని గ్రామాల్లో మీరు స్వయంగా పర్యటించండి' అని రైతులు దలైలామాకు రాసిన లేఖలో కోరారు.
మీరు ఒక్కసారి రావాలి.. దలైలామాకు అమరావతి రైతుల లేఖలు - రాజధాని అమరావతి వార్తలు
ఏడాదికాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని బౌద్ధ మత గురువు దలైలామాను అమరావతి రైతులు కోరారు. గత కొన్ని నెలలుగా మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
amaravathi farmers letter to dalailama