ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా దిగిపోయేంత వరకు ఉద్యమం చేస్తాం: అమరావతి రైతులు - Guntur District Latest News

మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన '500 కాదు.. వెయ్యి రోజులు ఉద్యమం చేయండి.. ఎవరు కాదన్నారు..?' వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే.. వైకాపా దిగిపోయేంతవరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం శ్మశానంగా, ఎడారిగా మారిందని మహిళలు మండిపడ్డారు.

అమరావతి రైతులు
అమరావతి రైతులు

By

Published : May 1, 2021, 6:53 PM IST

అమరావతి రైతులు

అమరావతి ఉద్యమంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వాఖ్యలను రాజధాని మహిళలు తిప్పికొట్టారు. వైకాపా నేతలు ఇదే ధోరణిని అవలంభిస్తే ఆ పార్టీ దిగిపోయేంత వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో అమరావతే రెఫరెండంగా పోటీలో దిగుతామని తేల్చిచెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం శ్మశానం, ఎడారిగా మారిందని మహిళలు మండిపడ్డారు.

పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ... మహిళలు 501వ రోజు అమరావతి గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, బోరుపాలెం, వెంకటపాలెం, అనంతవరం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details