ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల అందోళన - capital farmers dharna

రాజధాని గురించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై... రాజధాని రైతులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెలుగుదేశం నేతలు, రైతులు ధర్నాకు దిగారు. అమరావతిని శ్మశానంతో పోల్చిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

amaravathi farmers  fires on botsa satyanarayana comments on capital
బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల అందోళన

By

Published : Nov 26, 2019, 8:00 PM IST

బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల అందోళన

రాజధాని అమరావతి గురించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెలుగుదేశం నేతలు, రైతులు ధర్నాకు దిగారు. ఎర్రబాలెంలోని శివాలయం కూడలిలో వాహనాలు అడ్డగించారు. అమరావతిని శ్మశానంతో పోల్చిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణ సమానమైన భూములను శ్మశానంతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రాంతం శ్మశానమైతే పాలన ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details