ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్రాంతికి ఉపవాసం.. రాజధాని రైతుల నిర్ణయం - etv bharat

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు పండగ రోజు పస్తులు ఉండాలని నిర్ణయించారు. సంక్రాంతి రోజున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసం చేయనున్నట్టు ప్రకటించారు.

amaravathi farmers decides to hunger protest tomorrow
amaravathi farmers decides to hunger protest tomorrow

By

Published : Jan 14, 2020, 6:13 PM IST

రాజధాని అమరావతి పోరాటాన్ని రైతులు, మహిళలు మరింత ముందుకు తీసుకుపోతున్నారు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవవుతున్న పరిస్థితిల్లో తమ ఆగ్రహాన్ని దీక్షలు, పోరాటాలతోనే వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బోగి సందర్భంగా.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను మంటల్లో దహనం చేసిన రైతులు.. రేపు సంక్రాంతి సందర్భంగా పస్తులు ఉండాలని నిర్ణయించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజధానిలోని గ్రామాల్లోని రైతులు.. ఉపవాసం చేయనున్నట్టు ప్రకటించారు. పండగ పూట ఖాళీ కడుపులతో ఉండడానికి ప్రభుత్వ తీరే కారణమని.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి వంటా వార్పునూ రద్దు చేస్తున్నట్టు తెలిపారు.


Conclusion:

ABOUT THE AUTHOR

...view details