పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 445వ రోజు ఆందోళన చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి, దొండపాడు, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. విశాఖ ఉక్కు, రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం హామి ఇచ్చినట్లుగా.. తమకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం.. అభివృద్ధి పేరుతో విడుదల చేసే నిధులతో తమ ప్లాట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.
445వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు - రాజధాని రైతల ఆందోళనలు తాజా వార్తలు
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని మహిళలు, రైతులు డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు చేస్తున్న ఆందోళనలు 445వ రోజుకు చేరుకున్నాయి.
445వ రోజుకు చేరుకున్న రాజధాని రైతల ఆందోళనలు