ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం గద్దె దిగిపోవాలి: ఐకాస నేతలు - farmers 611 day protest at amaravathi

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేస్తున్న ధర్నా 611వ రోజుకు చేరింది. రాజధానిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు పర్యటనకు వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

611వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్ష
611వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్ష

By

Published : Aug 19, 2021, 6:45 PM IST

611వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్ష

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ధర్నా 611వ రోజుకు చేరింది. రాజధానిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు పర్యటనకు వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెనక్కి వెళ్లిపోవాలంటూ.. నినదించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగి రమేశ్​పై చర్యలు తీసుకోవాలంటూ.. ఎస్సీ ఐకాస నేతలు తుళ్లూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జోగి రమేశ్​ వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details