ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం - అమరాతవి ఉద్యమం తాజా వార్తలు

అమరావతి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గూంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద కలకలం సృష్టించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకోని వెంకటేశ్వరరావు అనే రైతు బలవన్మరణానికి యత్నించగా...ఇతర రైతులు అడ్డుకున్నారు.

అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం
అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 6, 2020, 9:06 PM IST

Updated : Dec 6, 2020, 9:35 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరులోని అమరావతి దీక్షా శిబిరంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వరరావు అనే రైతు... ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. అడ్డుకున్న ఇతర రైతులను అతనిపై నీళ్లు చల్లి కాపాడారు. శిబిరంలో.. ఈ ఘటన కలకలం సృష్టించింది.

రైతుల ఆందోళన

రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..రైతులు దీక్షను కొనసాగిస్తున్నారు. రోడ్లపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు.

అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:

ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరంపై రాళ్లదాడి

Last Updated : Dec 6, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details