అమరావతినినే రాజధానిగా కొనసాగించాలంటూ... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బొప్పన రమేష్ కుమార్ అనే వ్యక్తి రోడ్డుపైనే పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన స్థానికులు, రైతులు, పోలీసులు అతనిపై నీళ్లు చళ్లారు. తాను అమరావతి నిర్మాణానికి 4 ఎకరాలు ఇచ్చానని.. ఇప్పుడు రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలే గతి అవుతాయని ఆవేదన వ్యక్తంచేశాడు. ఇకనైనా ప్రభుత్వం అమరావతి తరలింపు ఆలోచనను మానుకోవాలని కోరారు.
'అమరావతి' కోసం రైతు ఆత్మహత్యాయత్నం - పెనుమాకలో రైతు ఆత్మహత్యాయత్నం
అమరావతినినే రాజధానిగా కొనసాగించాలంటూ... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలే గతి అవుతాయని ఆవేదన వ్యక్తంచేశాడు.
రైతు ఆత్మహత్యాయత్నం