ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు తక్షణమే ఆరోగ్య కార్డులు జారీ చేయాలని అమరావతి ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించి తమకు వైద్యం అందేలా చేయాలని... సీఎస్ నీలం సాహ్నీని కోరింది. మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు సహా.... 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలని... నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని సీఎస్తో సమావేశంలో ఐకాస ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ పింఛన్ కు.... 45 ఏళ్ల నిబంధన తొలగించాలని కోరామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల వయసు 65 ఏళ్లకు పెంచాలని.. సీపీఎస్ అంశాన్నీ త్వరగా తేల్చాలని చెప్పారు.
'ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేయండి' - అమరావతి ఉద్యోగుల జేఏసీ తాజా
అమరావతి ఉద్యోగుల ఐకాస ప్రతినిధులు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీతో భేటీ అయ్యారు. ఆరోగ్య కార్డుల జారీ, మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు వంటి విషయాలపై చర్చించారు.
తక్షణమే ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల జారీ చేయండి:అమరావతి ఉద్యోగుల జేఏసీ