ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమవరావతి అభివృద్ధి పనులు.. ఏఎమ్ఆర్​డీఏ నుంచి బదలాయింపు - amaravathi news

అమవరావతి అభివృద్ధి పనులను ప్రభుత్వం ఏఎమ్ఆర్​డీఏ నుంచి అమరావతి స్మార్ట్, సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్​కు బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పనులకు 360 కోట్ల రూపాయలను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అమవరావతి అభివృద్ధి పనులు ఏఎమ్ఆర్​డీఏ నుంచి బదలాయింపు
అమవరావతి అభివృద్ధి పనులు ఏఎమ్ఆర్​డీఏ నుంచి బదలాయింపు

By

Published : Apr 22, 2021, 6:54 AM IST

అమరావతి స్మార్ట్ సిటీ ప్రాంతంలో చేపట్టాల్సిన ముఖ్యమైన పనులను.. ఏఎమ్ఆర్​డీఏ నుంచి అమరావతి స్మార్ట్, సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్​కు బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి స్మార్ట్ సిటీ ప్రాంతంలో.. ముఖ్యమైన 10 ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను.. ఇక నుంచి అమరావతి స్మార్ట్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపడుతుందని స్పష్టం చేసింది.

ఈ పనులు కోసం 360 కోట్ల రూపాయలను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి శాసన రాజధానిలోని సీడ్‌యాక్సెస్ రహదారికి అనుసంధానించేందుకు కృష్ణా కుడి గట్టున 15.5 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ ప్రాజెక్టు స్మార్ట్ వార్డులు, స్మార్ట్ పోల్స్ నిర్మాణం కోసం..ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details