కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయాలని కోరుతూ రాజధాని గ్రామమైన మందడంలో అమరావతి ఎస్సీ రైతుల ఐకాస దీక్ష చేపట్టింది. శిబిరాన్ని సందర్శించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వారికి మద్దతు తెలిపారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాన్నిచ్చే అమరావతిని చంపేశారని మండిపడ్డారు. రాజధాని రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. కేసులను వెంటనే రద్దు చేయకపోతే 13 జిల్లాలో ఆందోళనలు చేస్తామని ఎస్సీ రైతుల ఐకాస నేతలు హెచ్చరించారు.