ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు నేడూ సాగాయి. దసరా పండుగ రోజు సైతం దీక్షా శిబిరాల్లో నిరసనలు చేశారు. మందడం, వెలగపూడి, అనంతవరం, వెంకటపాలెం, నెక్కల్లు, లింగాయపాలెం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షలు కొనసాగించారు. అనంతవరం, మందడం దీక్షా శిబిరాల్లో రాజరాజేశ్వరి దేవీ అవతారంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగిన రోజునే నిజమైన పండుగ చేసుకుంటామని....అప్పటి వరకు ఏ శుభకార్యమైనా, శిబిరాల్లోనే నిర్వహిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఉద్ధృతంగా ఉద్యమం... దీక్షా శిబిరాల్లో అమ్మవారికి పూజలు
అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు నేడూ కొనసాగాయి. దసరా సందర్భంగా దీక్షా శిబిరాల్లోనే అమ్మవారికి పూజలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతి రైతుల ఉద్యమం