బలరామ స్ఫూర్తితో.. రాజధానిగా అమరావతినే సాధించి తీరుతామని.. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కూమరస్వామి అన్నారు. బలరామ జయంతి సందర్భంగా.. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు దీక్షా శిబిరంలో.. రైతులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. బలరాముడి చిత్రపటానికి పూలమాల వేసి నాగలికి పూజలు నిర్వహించారు. అమరావతి ఉద్యమం 635వ రోజున నిరసనలు కొనసాగించారు. జై అమరావతి అని నినదించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మందడంలో గణపతికి ఉండ్రాళ్ల పూజ చేశారు.
Amaravathi protest: 'బలరామ స్ఫూర్తితో అమరావతినే ఏకైక రాజధానిగా సాధిస్తాం' - 635వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. రైతులు 635వ రోజు దీక్షలు కొనసాగించారు. బలరామ స్ఫూర్తితో అమరావతినే ఏకైక రాజధానిగా సాధించి తీరుతామని.. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కూమరస్వామి చెప్పారు. బలరామ జయంతి సందర్భంగా.. తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
'బలరామ స్ఫూర్తితో అమరావతినే ఏకైక రాజధానిగా సాధిస్తాం'