ఒకే రాష్ట్రం...ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు 209వ రోజూ నిరసనలు కొనసాగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తుళ్లూరు, అనంతవరం, మల్కాపురం, మందడం, రాయపూడి, దొండపాడు, పెద పరిమిలో రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కౌలు డబ్బులు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడిచినా ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదని మహిళలు ఆరోపించారు. కౌలు.. రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్మృతి వనంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
209వ రోజూ అమరావతి రైతుల ఆందోళన
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళన 209వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు... కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు... కౌలు వెంటనే చెల్లించాలని కోరారు.
209వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళన