అమరావతిలో నిరసనల హోరు... ఉద్యమ జోరు - కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసన
రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలో మహిళలు, రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు 57వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల ఆందోళనకు పార్టీలు, ప్రజాసంఘాల సంఘీభావం ప్రకటిస్తున్నాయి. తుళ్లూరు మహాధర్నాలో తెదేపా ప్రతినిధుల బృందం పాల్గొంది. రైతులు, మహిళల పోరాటానికి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు.
కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసన