అమరావతినే రాజధానిని కొనసాగించాలంటూ.. గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో రైతులు చేస్తోన్న ఆందోళనలు 41 రోజులకు చేరుకున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని కోసం తాము భూములు ఇస్తే... ఇప్పుడు వేరే ప్రాంతానికి తరలిస్తామనడం సరికాదని మహిళలు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని విషయంలో దాగుడుమూతలు ఆడటం సరికాదని రైతులు విమర్శించారు. ప్రధానితో భేటీఅంశాలను ముఖ్యమంత్రి ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రాజధాని ఇక్కడే ఉంచుతామని ప్రకటించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
'అమరావతిపై కేంద్రమూ దాగుడుమూతలాడుతోంది'
అమరావతి రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించట్లేదని తాడికొండి మండలం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని వాపోయారు. జగన్... మోదీ కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. 13 జిల్లాలూ పాదయాత్ర చేసైనా సరే.... అమరావతినే రాజధానిగా కొనసాగేలా చేస్తామని తేల్చి చెప్పారు.
తాడికొంలో అమరావతి ఉద్యమం