రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ - రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్
రాజధాని కోసం ఐకాస ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ ఏర్పాటు చేశారు. ప్రజలంతా అమరావతే కోరుకుంటున్నంట్లు తెలిపింది ఐకాస. తెదేపా మాత్రమే నిరసనలు చేస్తుందనడం సమంజసం కాదని ఐకాస నేతలు తెలిపారు.
amaravath-praja-ballot-in-guntur
రాజధాని అమరావతికి మద్దతుగా రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియజేసేందుకే ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు ఐకాస నాయకులు తెలియజేశారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని మార్చడం సబబు కాదన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.