ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - amaravahti capital womens protest

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 467వ రోజూ ఆందోళనలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అనంతవరంలోని పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు.

amaravahti capital farmers, womens protest in guntur district
అమరావతి రైతుల ఆందోళన

By

Published : Mar 28, 2021, 4:29 PM IST

ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 467వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడులో నిరసనలు కొనసాగాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అనంతవరంలో రైతులు, మహిళలు గ్రామంలోని పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు. మందడంలో అరుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details