రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమరావతి ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. రాజధాని ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాజధాని గ్రామాల్లో మహిళా జేఏసీ నేతలు పర్యటించనున్నారు. 26న విజయవాడ ధర్నాచౌక్‌లో వేల సంఖ్యలో మహిళలు 24 గంటల నిరాహారదీక్ష చేయనున్నారు. ముందుగా తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గుంటూరులో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఐకాస నిర్ణయించింది. చిత్రపరిశ్రమ మద్దతు పలకాలని మహిళా సంఘాల నేతలు కోరారు.
అమరావతి ఉద్యమ భవిష్యత్‌పై కార్యాచరణ
రాజధాని ఉద్యమం ఉద్ధృతం చేసేందుకు మహిళలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై ప్రణాళిక సిద్ధం చేశారు.
అమరావతి ఉద్యమ భవిష్యత్‌పై కార్యాచరణ